చేష్టలుడిగిన ఎన్నికల కమిషన్… చెలరేగిపోతున్న పోలీసులు… టీ.డీ.పీ కూటమి రౌడీలు గుండాలు

Andhra News, BJP, Congress, News, Uncategorized

హైదరాబాద్: దాడులు….దౌర్జన్యాలు

ఆస్తుల విధ్వంసం … తగులపెట్టడం

నామినేషన్లు అడ్డుకోవడం …. అభ్యర్థులపై దాడులు

చేస్తున్న తెలుగు దేశం పార్టీ రౌడీలు, గుండాలు

ప్రధాన ప్రత్యర్థి వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల అరెస్టులు – కిడ్నపులు

ప్రధాన నాయకుల గృహ నిర్బంధాలు

బైండోవర్ల పేరుతో కార్యకర్తలను రెండు రోజుల నుంచి అక్రమంగా నిర్బంధిస్తున్న పోలీసులు.

ఇది ఆంధ్ర ప్రదేశ్ లో నేటి నుండి  జరుగుతున్న ఎమ్. పీ. టీ. సి,  జెడ్. పీ. టీ.సి  ఎన్నికల తీరు.

ప్రధాన ప్రత్యర్థి  వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయకుండా ఉండడానికి పోలీసులు అభ్యర్థులను ముందుగానే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అక్టోబర్ 21 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు  ఎమ్. పీ. టీ. సి,  జెడ్. పీ. టీ.సి  నామినేషన్లు దాఖలు చేయటానికి ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

నేడు ఉదయం 10. 30 గంటల నుంచి రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు అభ్యర్థుల నుంచి స్వీకరించాల్సి ఉండగా, వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను పోలీసుల అక్రమంగా అరెస్టు చేసి తీసుకుపోతున్నారు. అలాగే వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను, ఎమ్.పీ .లు, ఎమ్. ఎల్. ఏ లను పోలీసులు అభ్యర్థులను కలవనీయకుండా గృహ నిర్బంధం చేస్తున్నారు. వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ. సతీష్ రెడ్డి ని వేంపల్లిలో, పోరుమామ్మిల్ల లో డి.సి. గోవింద రెడ్డి ని, బద్వేల్ ఎమ్. ఎల్. ఏ డా. సుధ, జమ్మలమడుగు, ప్రొద్దటూరు, మైదుకూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు తదితర జిల్లాలలో ముఖ్య నాయకులందరిని గృహ నిర్బంధం చేసారు. రాష్ట్రంలోని 659 జెడ్పీటీసీ (ZPTC) స్థానాలకు మరియు 9,829 ఎంపీటీసీ (MPTC) స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను
ఎస్‌.ఈ.సీ ప్రకటించింది.

గత వారంలో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నామినేషన్ల లోను తెలుగు దేశం కూటమి గుండాలు, రౌడీలు దౌర్జన్యాలు చేసి, అభ్యర్థులను చితకకొట్టి నామినేషన్లు చించివేశారు. పోలీసులు వారికీ సహకరిస్తూ  వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయటానికి అనుమతించలేదు. పులివెందులలో పోలీసులు  వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అడ్డుకోవటమే కాకుండా ఎమ్.పీ అవినాష్ రెడ్డి మరియు ఇతర నాయకులపై పోలీసులు ఏ. కె  47 తో  కాల్పులు జరిపారు. అలాగే అక్టోబర్ 16 వ తేదీన పుంగనూరులో నామినేషన్లు వేయించడానికి వచ్చిన రాజంపేట ఎమ్. పీ మిథున్ రెడ్డిపై కర్రలు, రాళ్లు ఇతర మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు. మిథున్ రెడ్డి సి.ఆర్.పీ.ఎఫ్ గన్మెన్ ఆత్మరక్షణ కోసం గాలిలో కాల్పులు జరిపారు.

తిరుపతి ఎమ్.పీ గురుమూర్తి ఇతర అభ్యర్థులను అడ్డగించి నామినేషన్ పాత్రలను చించివేశారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉలుకు, పలుకు లేకుండా చేష్టలుడిగి మౌనంగా చూస్తుంది. జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లు ఎవరికి అనుబాటులో ఉండటంలేదు, ఫోన్లు చేసిన పలకడంలేదు. శాంతిభద్రతలు కాపాడవలసిన జిల్లా ఎస్పీలు  వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభ్యర్థుల విన్నపాలను పెడచెవిన పెడుతున్నారు.

Leave a Reply